విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం · కేంద్రీయ ప్రాచీన తమిళ సంస్థ (CICT), చెన్నై
కాశీ తమిళ సంగమం 5.0
కాశీ తమిళ సంగమం 5.0
திருக்குறள் பயில்வோம் · Thirukkural Payilvom – Thirukkural Abhyas Karen · तिरुक्कुरल अभ्यास करें · Let's Learn Thirukkural
కేంద్రీయ ప్రాచీన తమిళ సంస్థ (CICT), చెన్నై · విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
ఈ ఇంటర్‌ఫేస్ అనువాదం ముసాయిదా దశలో ఉంది; CICT దీనిని సమీక్షిస్తోంది. English
వెనుకకు
అనువాదాలు

108 திருக்குறள் · 108 తిరుక్కురళ్

తిరుక్కురళ్‌లోని మొదటి 108 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయం నుంచి ఒక కురళ్ చొప్పున CICT ఎంచుకున్నవి: ధర్మం (அறத்துப்பால்), సంపద (பொருட்பால்) అనే రెండు భాగాలూ పూర్తిగా, తమిళ వ్యాఖ్యానంతో. పాల్గొనే సంస్థ తన ఆన్‌లైన్ మూల్యాంకనాన్ని ఈ 108 కురళ్ళ నుంచి మాత్రమే రూపొందించుకోవచ్చు; వీటిని మీ భాషలో, తమిళ వ్యాఖ్యానాన్ని తమిళంలో చదవండి.

అభ్యాస పరీక్ష రాసి చూడండి
తమిళ కురళ్‌ను కంప్యూటర్ స్వరం చదివి వినిపిస్తుంది.

அறத்துப்பால் · Virtue

1
1. கடவுள் வாழ்த்து · The Praise of God
அகர முதல எழுத்தெல்லாம் ஆதிபகவன் முதற்றே உலகு.
అక్షరాలన్నింటికీ అకారమే ఆది
అదే విధంగా ఈ ప్రపంచానికి భగవంతుడే ఆద్యుడు.
11
2. வான்சிறப்பு · The Blessing of Rain
வான்நின்று உலகம் வழங்கி வருதலால்தான்அமிழ்தம் என்றுணரற் பாற்று.
వర్షం వలన ప్రపంచం వర్ధిల్లుతున్నది
అందువలన ప్రపంచంలోని జీవరాశులకు అది అమృతమని గ్రహించాలి.
30
3. நீத்தார் பெருமை · The Greatness of Ascetics
அந்தணர் என்போர் அறவோர்மற் றெவ்வுயிர்க்கும்செந்தண்மை பூண்டொழுக லான்.
సకల జీవరాశిని ప్రేమించి కరుణామృతాన్ని వర్షించే ధర్మాత్ములైన పెద్దలు ఎవరైనప్పటికీ వారు బ్రాహ్మణులు అని పిలువబడుతారు.
36
4. அறன் வலியுறுத்தல் · Assertion of the Strength of Virtue
அன்றறிவாம் என்னாது அறஞ்செய்க மற்றதுபொன்றுங்கால் பொன்றாத் துணை.
`తరువాత చేసుకోవచ్చులే' - అని వాయిదా వేయకుండా యువకులు ధర్మ మార్గంలో ప్రవర్తించాలి
మరణ సమయంలో ఆ ధర్మమే అతనికి తోడుగా ఉంటుంది.
50
5. இல்வாழ்க்கை · Domestic Life
வையத்துள் வாழ்வாங்கு வாழ்பவன் வான்உறையும்தெய்வத்துள் வைக்கப் படும்.
ధర్మమార్గంలో సంచరిస్తూ గృహస్థ జీవితాన్ని సాగించే వ్యక్తి ఆ దైవానికి సమానంగా గౌరవింపబడుతున్నాడు.
60
6. வாழ்க்கைத் துணைநலம் · The Worth of a Wife
மங்கலம் என்ப மனைமாட்சி மற்றதன்நன்கலம் நன்மக்கட் பேறு.
భార్య సౌశీల్యమే గృహస్థ జీవితానికి ముఖ్యమైనది
మంచి సంతానాన్ని పొందడమే దానికి ఆభరణాలని చెబుతారు.
66
7. மக்கட்பேறு · The Wealth of Children
குழல்இனிது யாழ்இனிது என்பதம் மக்கள்மழலைச்சொல் கேளா தவர்.
తమ కన్నబిడ్డల తొక్కుడు పలుకులు వినలేనివారు మాత్రమే వేణుగానం
యాళివాయిద్యనాదం మధురమని చెబుతారు.
72
8. அன்புடைமை · The Possession of Love
அன்பிலார் எல்லாம் தமக்குரியர் அன்புடையார்என்பும் உரியர் பிறர்க்கு.
ప్రేమలేనివారు ప్రతివస్తువూ తమకే కావాలని, దాన్ని స్వంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు
ప్రేమగలవారు తమ శరీరం, వస్తువులు, ప్రాణం అన్నీ పరోపకారార్థమే అని భావిస్తారు.
90
9. விருந்தோம்பல் · Hospitality
மோப்பக் குழையும் அனிச்சம் முகந்திரிந்துநோக்கக் குழையும் விருந்து.
`అనిచ్చం' అనే పుష్పాన్ని వాసన చూసిన వెంటనే అది వాడిపోతుంది
అదే విధంగా ముఖాన్ని చిట్లించుకొని ఆహ్వానిస్తే అతిథుల మొహం వాడిపోతుంది.
100
10. இனியவை கூறல் · The Utterance of Pleasant Words
இனிய உளவாக இன்னாத கூறல்கனியிருப்பக் காய்கவர்ந் தற்று.
మధురములైన మాటలు ఎన్నో ఉన్నపుడు వాటిని వదలి కఠినంగా మాట్లాడ్డం తీయని పండును వదలి పచ్చికాయను తినడానికి సమ మవుతుంది.
101
11. செய்ந்நன்றியறிதல் · Gratitude
செய்யாமல் செய்த உதவிக்கு வையகமும்வானகமும் ஆற்றல் அரிது.
తాను ఏ సహాయమూ పూర్వం చేయకపోయినప్పటికీ ఒక వ్యక్తి తనకు సహాయం చేసినట్లయితే ఆ సహాయానికి స్వర్గమర్త్యలోకాలు ఇచ్చినప్పటికీ సమానంకావు.
120
12. நடுவு நிலைமை · Impartiality
வாணிகம் செய்வார்க்கு வாணிகம் பேணிப்பிறவும் தமபோல் செயின்.
ఇతరుల వస్తువులైనప్పటికీ వాటిని తన వస్తువులుగా భావించి సమదృష్టితో వర్తకం చేయడమే నిజమైన వర్తక నీతి అవుతుంది.
129
13. அடக்கம் உடைமை · The Possession of Self-restraint
தீயினாற் சுட்டபுண் உள்ளாறும் ஆறாதேநாவினாற் சுட்ட வடு.
అగ్ని సోకినందువలన ఏర్పడిన పుండు మచ్చగా బయట ఉన్నప్పటికీ లోపల మానిపోయి ఉంటుంది
అయితే ద్వేషంతో పలికిన మాటలవలన కలిగే గాయం ఎన్నటికీ ఆరదు.
131
14. ஒழுக்கம் உடைமை · The Possession of Decorum
ஒழுக்கம் விழுப்பந் தரலான் ஒழுக்கம்உயிரினும் ஓம்பப் படும்.
సత్ప్రవర్తన పదిమందిలో గౌరవాన్ని కలిగిస్తుంది
అందువలన సత్ప్రవర్తన ప్రాణంకన్న మిన్నగా ప్రశంసింపబడుతుంది.
148
15. பிறனில் விழையாமை · Not coveting another's Wife
பிறன்மனை நோக்காத பேராண்மை சான்றோர்க்குஅறனொன்றோ ஆன்ற வொழுக்கு.
వేరొకరి భార్యను కామ దృష్టితో చూడని ఉత్కృష్ట గుణం ధర్మమార్గం మాత్రమే కాదు అది సత్ప్రవర్తనకు శిఖరం కూడ.
152
16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
பொறுத்தல் இறப்பினை என்றும் அதனைமறத்தல் அதனினும் நன்று.
చెప్పలేనంత చెరుపు చేసినప్పటికీ దానిని సహించి ఉండడం కన్న ఆ చెరుపును పూర్తిగా మరిచి పోవడమే ఉత్తమ గుణం.
161
17. அழுக்காறாமை · Not Envying
ஒழுக்காறாக் கொள்க ஒருவன்தன் நெஞ்சத்துஅழுக்காறு இலாத இயல்பு.
హృదయంలో మాత్సర్యం లేకుండా జీవనం సాగించే స్వభావమే సచ్ఛీలమని భావించాలి.
178
18. வெஃகாமை · Not Coveting
அஃகாமை செல்வத்திற்கு யாதெனின் வெஃகாமைவேண்டும் பிறன்கைப் பொருள்.
తన సంపద తరిగిపోకుండా ఉండాలనుకునేవాడు ఇతరుల వస్తువులను ఆక్రమించు కోవాలని ఆశించకూడదు.
190
19. புறங்கூறாமை · Not Backbiting
ஏதிலார் குற்றம்போல் தங்குற்றங் காண்கிற்பின்தீதுண்டோ மன்னும் உயிர்க்கு.
ఇతరుల దోషాలను లెక్కించేవాళ్లు తమ దోషాలను కూడ లెక్కించి చూడగలిగి నట్లయితే వాళ్లకు కష్టాలు ఎన్నటికీ కలగవు.
200
20. பயனில சொல்லாமை · Against Vain Speaking
சொல்லுக சொல்லிற் பயனுடைய சொல்லற்கசொல்லிற் பயனிலாச் சொல்.
ప్రయోజన రహితములైన మాటలను పరిహరించి ప్రయోజనం కలిగించే మాటలనే మాట్లాడాలి.
202
21. தீவினையச்சம் · Dread of Evil Deeds
தீயவை தீய பயத்தலால் தீயவைதீயினும் அஞ்சப் படும்.
పాప కర్మల వలన పాపమే కలుగుతుంది
అందువలన ఆ పనులు నిప్పు కన్న భయంకరమైనవని భావించి వాటిని చేయడానికి భయపడాలి.
211
22. ஒப்புரவறிதல் · Duty to Society
கைம்மாறு வேண்டா கடப்பாடு மாரிமாட்டுஎன்னாற்றுங் கொல்லோ உலகு.
తమకు ఉపకారం చేస్తున్న వర్షానికి ప్రజలు ప్రత్యుపకారం ఏం చేస్తున్నారు? ఆ వర్షాన్ని పోలిన పెద్దలు ప్రత్యుపకారాన్ని ఆశించి సహాయం చేసేవాళ్లు కారు.
226
23. ஈகை · Giving
அற்றார் அழிபசி தீர்த்தல் அஃதொருவன்பெற்றான் பொருள்வைப் புழி.
ఆకలి అని వచ్చేవారి ఆకలిబాధను పోగొట్టాలి
అది భవిష్యత్కాలంలో తనకు ఉపకరించడం కోసం కూడబెట్టిన నిధి అవుతుంది.
231
24. புகழ் · Renown
ஈதல் இசைபட வாழ்தல் அதுவல்லதுஊதியம் இல்லை உயிர்க்கு.
దానం చేస్తూ కీర్తి ప్రతిష్టలతో జీవించాలి
దానికి మించిన ప్రయోజనం మానవజాతికి వేరేదీలేదు.
241
25. அருளுடைமை · Compassion
அருட்செல்வம் செல்வத்துள் செல்வம் பொருட்செல்வம்பூரியார் கண்ணும் உள.
క్రూరాత్ములైన దుర్మార్గుల దగ్గర కూడ అశేషమైన సంపద ఉంది
కాని ఆ సంపద దయా సంపదకు సమానం కాదు.
260
26. புலால் மறுத்தல் · Abstinence from Flesh
கொல்லான் புலாலை மறுத்தானைக் கைகூப்பிஎல்லா உயிருந் தொழும்.
మాంసం తినని వాళ్లను
మాంసం కోసం ప్రాణులను చంపని వాళ్లను సకల జీవరాశులు నమస్కరించి ఆశీర్వదిస్తాయి.
261
27. தவம் · Penance
உற்றநோய் நோன்றல் உயிர்க்குறுகண் செய்யாமைஅற்றே தவத்திற் குரு.
దేనినైనా భరించే హృదయాన్ని కలిగి ఉండడం
ఏ ప్రాణికీ హాని తలపెట్టకుండా ఉండడం `తపస్సు' అని చెప్పబడుతుంది.
273
28. கூடா ஒழுக்கம் · Imposture
வலியில் நிலைமையான் வல்லுருவம் பெற்றம்புலியின்தோல் போர்த்துமேய்ந் தற்று.
మనసును అణచుకోలేనివారు తపోవేషం ధరించడం ఆవు పులితోలు కప్పుకొని పైరు మేయడంతో సమానం.
281
29. கள்ளாமை · The Absence of Fraud
எள்ளாமை வேண்டுவான் என்பான் எனைத்தொன்றும்கள்ளாமை காக்கதன் நெஞ்சு.
ఏ వస్తువునైనా అపహరిద్దామనే ఆలోచన హృదయంలో రాకుండా చూసుకునేవాడే నవ్వులపాలు కాకుండా జీవనం సాగించగలడు.
291
30. வாய்மை · Veracity
வாய்மை எனப்படுவது யாதெனின் யாதொன்றும்தீமை இலாத சொலல்.
ఇతరులకు కించిత్తయినా కీడుకలిగించని మాటలు మాట్లాడ్డమే సత్యమని చెప్పబడుతుంది.
305
31. வெகுளாமை · Restraining Anger
தன்னைத்தான் காக்கின் சினங்காக்க காவாக்கால்தன்னையே கொல்லுஞ் சினம்.
ఒకడు తన్ను తాను సంరక్షించుకోవాలనుకుంటే మొదట కోపాన్ని వదలుకోవాలి
లేకపోతే ఆ కోపమే అతన్ని నాశనం చేస్తుంది.
314
32. இன்னா செய்யாமை · Not doing Evil
இன்னாசெய் தாரை ஒறுத்தல் அவர்நாணநன்னயஞ் செய்து விடல்.
తమకు కీడుచేసిన వారిని దండించడానికి సరియైన పద్ధతి అతడు సిగ్గుతో తలవంచుకునేలే అతనికి మేలుచేయాలి
అతడు చేసిన అపకారాన్ని వెంటనే మరచిపోవాలి.
322
33. கொல்லாமை · Not killing
பகுத்துண்டு பல்லுயிர் ஓம்புதல் நூலோர்தொகுத்தவற்றுள் எல்லாந் தலை.
లభించిన దానిని అందరితో కలసి పంచుకొని ప్రాణులను రక్షించడం అనేది ధర్మశాస్త్రజ్ఞులు చెప్పిన ధర్మాలన్నింటిలోనూ మేలైనది.
336
34. நிலையாமை · Instability
நெருநல் உளனொருவன் இன்றில்லை என்னும்பெருமை உடைத்துஇவ் வுலகு.
నిన్న ప్రాణాలతో ఉన్న వ్యక్తిని నేడు లేకుండా చేశామనే గర్వాన్ని ఒక ప్రశస్తిగా ఈ లోకం కలిగి ఉంది.
350
35. துறவு · Renunciation
பற்றுக பற்றற்றான் பற்றினை அப்பற்றைப்பற்றுக பற்று விடற்கு.
బంధాలకు అతీతుడైన భగవంతునిపై మాత్రమే భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి
బంధాలను తెంచుకోవడానికి అతనిపై పెట్టుకొన్న భక్తియే సహాయం చేస్తుంది.
355
36. மெய்யுணர்தல் · Truth-Conciousness
எப்பொருள் எத்தன்மைத் தாயினும் அப்பொருள்மெய்ப்பொருள் காண்பது அறிவு.
ఒక వస్తువు ఎలా కనిపించినప్పటికీ ఆకారాన్ని చూసి మోసపోకుండా దాని నిజ స్థితిని తెలుసుకోవడమే నిజతత్త్వం
అదే జ్ఞానంగా భావింపబడుతుంది.
361
37. அவா அறுத்தல் · Curbing of Desire
அவாஎன்ப எல்லா உயிர்க்கும் எஞ்ஞான்றும்தவாஅப் பிறப்பீனும் வித்து.
ప్రాణులన్నింటికీ అన్ని కాలాల్లోనూ జన్మ అనే దుఃఖం ఏర్పడ్డానికి కోరికయే విత్తుగా ఉందని చెబుతారు.
380
38. ஊழ் · Fate
ஊழிற் பெருவலி யாவுள மற்றொன்றுசூழினுந் தான்முந் துறும்.
విధికంటె బలీయమైంది వేరొకటుందా? విధిని తప్పించుకోవడానికి వేరొక ఉపాయాన్ని ఆలోచిస్తే అక్కడకూడ విధి ముందుగా వచ్చి నిలుస్తున్నది.

பொருட்பால் · Wealth

388
39. இறைமாட்சி · The Greatness of a King
முறைசெய்து காப்பாற்றும் மன்னவன் மக்கட்குஇறையென்று வைக்கப் படும்.
నీతిమార్గం తప్పక పరిపాలన సాగిస్తూ ప్రజలను సంరక్షించే రాజును మాత్రమే ప్రజానాయకుడని ప్రశంసిస్తారు
391
40. கல்வி · Learning
கற்க கசடறக் கற்பவை கற்றபின்நிற்க அதற்குத் தக.
నేర్చుకోవలసిన వాటిని క్షుణ్ణంగా అంటే దోషరహితంగా నేర్చుకోవాలి
నేర్చుకొన్న తరువాత ఆ విద్యకు అనుగుణంగా నడుచుకోవాలి
410
41. கல்லாமை · Ignorance
விலங்கொடு மக்கள் அனையர் இலங்குநூல்கற்றாரோடு ஏனை யவர்.
మానవులకు జంతువులకు మధ్య ఏం భేదం ఉందో అంతే భేదం జ్ఞానాన్నిచ్చే గ్రంథాలు చదివినవారికి
ఆ గ్రంథాలు చదవని వారికి మధ్య ఉంది
411
42. கேள்வி · Hearing
செல்வத்துட் செல்வஞ் செவிச்செல்வம் அச்செல்வம்செல்வத்து ளெல்லாந் தலை.
వినికిడి ద్వారా సంపాదించిన జ్ఞానసంపదయే అన్ని సంపదలకన్న మిన్నయైనది
423
43. அறிவுடைமை · The Possession of Knowledge
எப்பொருள் யார்யார்வாய்க் கேட்பினும் அப்பொருள்மெய்ப்பொருள் காண்ப தறிவு.
ఏ ఒక్క విషయాన్ని గురించి ఎవరు ఏది చెప్పినప్పటికీ దానిని అలాగే గుడ్డిగా విశ్వసించక దాని నిజతత్త్వాన్ని పరిశోధించి తెలుసుకోవడమే జ్ఞానం
436
44. குற்றங்கடிதல் · The Correction of Faults
தன்குற்றம் நீக்கிப் பிறர்குற்றங் காண்கிற்பின்என்குற்ற மாகும் இறைக்கு?
మొదట తనలోని దోషాలను తొలగించుకొని దాని తరువాత ఇతరుల దోషాలను ఎత్తిచూపే నాయకుడికి ఏం కొరత?
448
45. பெரியாரைத் துணைக்கோடல் · Seeking the Aid of Great Men
இடிப்பாரை இல்லாத ஏமரா மன்னன்கெடுப்பா ரிலானுங் கெடும்.
కఠినంగా మందలించి దోషాలను ఎత్తిచెప్పి హితము చెప్పే పెద్దలు లేకపోయినట్లయితే శత్రువులు ఎవరూ లేకపోయినప్పటికీ అతడు నశించిపోతాడు
452
46. சிற்றினம் சேராமை · Avoiding mean Associations
நிலத்தியல்பால் நீர்திரிந் தற்றாகும் மாந்தர்க்குஇனத்தியல்ப தாகும் அறிவு.
ఆ యా నేలల స్వభావానికి తగినట్లు నీటి రంగు మారుతుంటుంది
అదే విధంగా ప్రజల వివేకం తాము చేరిన సమూహాన్ని బట్టి రూపొందుతుంది
467
47. தெரிந்து செயல்வகை · Acting after due Consideration
எண்ணித் துணிக கருமம் துணிந்தபின்எண்ணுவம் என்பது இழுக்கு.
క్షుణ్ణంగా ఆలోచించిన తరువాతనే పనిలో దిగాలి
పని ప్రారంభించిన తరువాత ఆలోచిద్దామనుకోవడం తగదు.
471
48. வலியறிதல் · The Knowledge of Power
வினைவலியும் தன்வலியும் மாற்றான் வலியும்துணைவலியும் தூக்கிச் செயல்.
ఒక పని చేయడానికి ముందు ఆ పనికి కావలసిన శక్తి, తనశక్తి, శత్రువుల శక్తి
ఇరువురికీ తోడుగా ఉండే వారి శక్తి మొదలైనవి పరిశీలించిన తరువాతనే పనిలో ప్రవేశించాలి
490
49. காலமறிதல் · Knowing the fitting Time
கொக்கொக்க கூம்பும் பருவத்து மற்றதன்குத்தொக்க சீர்த்த இடத்து.
కాలం సానుకూలమయ్యేంతవరకూ కొంగవలె వేచియుండాలి
సరియైన కాలం ఆసన్నమైనపుడు కొంగ గురితప్పకుండా ముక్కుతో పొడిచి ఎరను నోట కరచుకొన్నట్లు పని ముగించాలి
495
50. இடனறிதல் · Knowing the Place
நெடும்புனலுள் வெல்லும் முதலை அடும்புனலின்நீங்கின் அதனைப் பிற.
నీళ్లలో ఉన్నంతవరకే మొసలికి బలం
నీటి నుండి బయటకు వచ్చినట్లయితే ఒక సాధారణ జంతువు కూడ దానిని గాయపరుస్తుంది
504
51. தெரிந்து தெளிதல் · Selection and Confidence
குணம்நாடிக் குற்றமும் நாடி அவற்றுள்மிகைநாடி மிக்க கொளல்.
ఒకరి గుణాలను దోషాలను పరిశీలించి వాటిలో ఏవి అధికంగా ఉన్నాయో తెలుసుకొని దానితరువాత అతని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవాలి
517
52. தெரிந்து வினையாடல் · Selection and Employment
இதனை இதனால் இவன்முடிக்கும் என்றாய்ந்துஅதனை அவன்கண் விடல்.
ఒకపనిని ఒకడు ఎలాచేసి ముగిస్తాడు అనేది పరీక్షించి తెలుసుకొని దాని తరువాత ఆ పనిని ఆ వ్యక్తికి అప్పగించాలి
527
53. சுற்றந் தழால் · Cherishing Kinsmen
காக்கை கரவா கரைந்துண்ணும் ஆக்கமும்அன்னநீ ரார்க்கே உள.
కాకి తనకు లభించిన దానిని దాచిపెట్టుకోక తన వారిని పిలిచి కలసి తింటుంది
అటువంటి స్వభావం గలవారికి మాత్రమే ఈ లోకంలో సంపద, ఔన్నత్యాలు ఉంటాయి
535
54. பொச்சாவாமை · Unforgetfulness
முன்னுறக் காவாது இழுக்கியான் தன்பிழைபின்னூறு இரங்கி விடும்.
ముందుగానే ఆలోచించి తన్ను తాను రక్షించు కోవడం మరచినవాడు కష్టాలు వచ్చినపుడు తన తప్పును తలచుకొని బాధపడుతాడు
542
55. செங்கோன்மை · The Right Sceptre
வானோக்கி வாழும் உலகெல்லாம் மன்னவன்கோல்நோக்கி வாழுங் குடி.
లోకంలో ప్రాణులన్నీ వానను ఎదురుచూస్తూ జీవిస్తున్నాయి
అదేవిధంగా ప్రజలందరూ రాజదండాన్ని అనగా న్యాయ సమ్మతమైన ప్రభుత్వాన్ని ఎదురుచూస్తూ జీవిస్తున్నారు
555
56. கொடுங்கோன்மை · The Cruel Sceptre
அல்லற்பட்டு ஆற்றாது அழுதகண் ணீரன்றேசெல்வத்தைத் தேய்க்கும் படை
దుర్మార్గాలను సహించలేక ప్రజలు చిందించే కన్నీరు ప్రభుత్వాన్ని కూలదూసే సైనికదళం అవుతుంది
561
57. வெருவந்த செய்யாமை · Absence of Terrorism
தக்காங்கு நாடித் தலைச்செல்லா வண்ணத்தால்ஒத்தாங்கு ஒறுப்பது வேந்து.
జరిగిన నేరాలను పక్షపాతం లేకుండా పరిశోధించి
మళ్లీ అవి జరగనీయకుండా వాటికి తగిన దండన విధించడమే రాజధర్మం
580
58. கண்ணோட்டம் · Benignity
பெயக்கண்டும் நஞ்சுண் டமைவர் நயத்தக்கநாகரிகம் வேண்டு பவர்.
సంస్కార భావాలతో కూడిన దయాహృదయులు తమకు చనువు ఉన్నవారు విషమిచ్చినప్పటికీ సంతోషంతో తాగుతారు
581
59. ஒற்றாடல் · Detectives
ஒற்றும் உரைசான்ற நூலும் இவையிரண்டும்தெற்றென்க மன்னவன் கண்.
సమర్థుడైన గూఢచారి
నీతిగ్రంధం ఇవి రెండూ రాజుకు రెండు కళ్లుగా భావింపబడుతోంది
595
60. ஊக்கம் உடைமை · Energy
வெள்ளத் தனைய மலர்நீட்டம் மாந்தர்தம்உள்ளத் தனையது உயர்வு.
నీటిలో పూసిన తామర తూడు పొడవు ఎంతో నీటిలోతు అంత
అదే విధంగా వ్యక్తి జీవితంలోని ఔన్నత్యం ఎంతో అతని మనసులోని ఆసక్తి అంత
605
61. மடி இன்மை · Unsluggishness
நெடுநீர் மறவி மடிதுயில் நான்கும்கெடுநீரார் காமக் கலன்.
కాలయాపన చేయడం, మరపు, సోమరితనం
మితిమీరిన నిద్ర ఈ నాలుగు చెడిపోయేవాడు అభిలషించి ఎక్కే పడవలు
611
62. ஆள்வினை உடைமை · Manly Effort
அருமை உடைத்தென்று அசாவாமை வேண்டும்பெருமை முயற்சி தரும்.
మన వలన ఇది చేయడానికి వీలవుతుందా అని సంశయించక వీలవుతుంది అనే నమ్మకంతో ప్రయత్నిస్తే అదే గొప్పశక్తిగా మారుతుంది.
621
63. இடுக்கண் அழியாமை · Hopefulness in Trouble
இடுக்கண் வருங்கால் நகுக அதனைஅடுத்தூர்வது அஃதொப்ப தில்.
కష్టాలు ముంచెత్తినపుడు కలత చెందక సంతోషంతో నవ్వాలి
కష్టాలను జయించడానికి నవ్వునకు మించినది వేరేదీలేదు
631
64. அமைச்சு · The Office of Minister of state
கருவியும் காலமும் செய்கையும் செய்யும்அருவினையும் மாண்டது அமைச்சு.
తగిన సాధనం, సరియైన కాలం, పనిచేసే విధం
తలపెట్టిన పని - వీటిని క్షుణ్ణంగా పరిశీలించి కార్యాచరణకు పూనుకొనేవాడే మంత్రి
645
65. சொல்வன்மை · Power of Speech
சொல்லுக சொல்லைப் பிறிதோர்சொல் அச்சொல்லைவெல்லுஞ்சொல் இன்மை அறிந்து.
ఈ మాటను వేరొక మాట జయించదు అని తెలుసుకొన్న తరువాతనే ఆ మాటను ప్రయోగించాలి
656
66. வினைத் தூய்மை · Purity in Action
ஈன்றாள் பசிகாண்பான் ஆயினுஞ் செய்யற்கசான்றோர் பழிக்கும் வினை.
ఆకలితో తపించిపోతున్న తల్లి వేదనను పోగొట్టడానికి సైతం నీచమైన పనుల్లో దిగకూడదు
666
67. வினைத்திட்பம் · Power in Action
எண்ணிய எண்ணியாங்கு எய்துப எண்ணியார்திண்ணியர் ஆகப் பெறின்.
అనుకొన్నది చేసి ముగించాలనే మనో ధైర్యం కలిగినవాళ్లు అనుకొన్నది చేసి విజయాన్ని సాధిస్తారు
672
68. வினை செயல்வகை · Modes of Action
தூங்குக தூங்கிச் செயற்பால தூங்கற்கதூங்காது செய்யும் வினை.
నిదానంగా చేయవలసిన పనులను నిదానంగానే చేయవచ్చు
అయితే త్వరగా చేయవలసిన పనులను మాత్రం ఆలస్యంగా చేయకూడదు
690
69. தூது · The Envoy
இறுதி பயப்பினும் எஞ்சாது இறைவற்குஉறுதி பயப்பதாம் தூது.
తనకు మరణమే సంభవించే పరిస్థితి ఎదురైనప్పటికీ దాని గురించి భయపడక ధైర్యంగా తన బాధ్యతలను నిర్వహించేవాడే తన రాజు నమ్మికకు పాత్రుడైన దూత
691
70. மன்னரைச் சேர்ந்து ஒழுகல் · Conduct in the Presence of the King
அகலாது அணுகாது தீக்காய்வார் போல்கஇகல்வேந்தர்ச் சேர்ந்தொழுகு வார்.
రాజుగారి దగ్గర సంచరించేవారు నిప్పుముందు చలికాచు కున్నట్లు మరీ దగ్గరికి వెళ్లక
మరీ వెనక్కి వెళ్లక జాగ్రత్తగా ప్రవర్తించాలి
706
71. குறிப்பறிதல் · The Knowledge of Indications
அடுத்தது காட்டும் பளிங்குபோல் நெஞ்சம்கடுத்தது காட்டும் முகம்.
అద్దం తనకు ఎదురుగా ఉన్నది చూపించినట్లు ఒకరి మనసులో ఉన్నది వారి ముఖం బహిర్గతం చేస్తుంది
711
72. அவை அறிதல் · The Knowledge of the Council Chamber
அவையறிந்து ஆராய்ந்து சொல்லுக சொல்லின்தொகையறிந்த தூய்மை யவர்.
మాటల అంతరార్ధాన్ని గ్రహించిన జ్ఞానులు సభా సదుల స్వభావాన్ని తెలుసుకొని దానికి తగినట్లు మాట్లాడుతారు
722
73. அவை அஞ்சாமை · Not to dread the Council
கற்றாருள் கற்றார் எனப்படுவர் கற்றார்முன்கற்ற செலச்சொல்லு வார்.
విద్యావంతుల సమక్షంలో తామునేర్చిన విషయాలను వాళ్ల హృదయాలకు హత్తుకునేలా చెప్పగల వ్యక్తి పండితులలో మేటిగా ప్రస్తుతింపబడతాడు
738
74. நாடு · The Land
பிணியின்மை செல்வம் விளைவின்பம் ஏமம்அணியென்ப நாட்டிற்கிவ் வைந்து.
వ్యాధిలేని జీవనం, అధిక దిగుబడి ఇచ్చే పంటలు, వస్తు సమృద్ధి
సుఖ శాంతులు, రక్షణ - ఈ ఐదు అంశాలు ఒక దేశానికి అలంకారాలు
742
75. அரண் · The Fortification
மணிநீரும் மண்ணும் மலையும் அணிநிழற்காடும் உடைய தரண்.
లోతైన విశాలమైన అగడ్త, విస్తారమైన భూమి, ఎత్తైన కొండల వరుస, దట్టమైన అడవి
ఇవి ఉంటేనే కోట
759
76. பொருள் செயல்வகை · Way of Accumulating Wealth
செய்க பொருளைச் செறுநர் செருக்கறுக்கும்எஃகதனிற் கூரிய தில்.
ప్రయత్నించి ఒకరు ధనాన్ని ఆర్జించాలి
శత్రువుల గర్వాన్ని అణచడానికి తగిన సాధనం ధనం తప్ప వేరేదీ లేదు
766
77. படை மாட்சி · The Excellence of an Army
மறமானம் மாண்ட வழிச்செலவு தேற்றம்எனநான்கே ஏமம் படைக்கு.
శౌర్యం, మానం, పెద్దలు చూపిన మార్గం
నాయకుని నమ్మిక పొందడం - ఈ నాలుగు సైన్యాన్ని కాపాడే గుణాలు
773
78. படைச் செருக்கு · Military Spirit
பேராண்மை என்ப தறுகண்ஒன் றுற்றக்கால்ஊராண்மை மற்றதன் எஃகு.
శత్రువులకు భయపడని శౌర్యమే మగతనమని ప్రశంసింపబడుతుంది
ఆ శత్రువులకు ఒక కష్టం వచ్చినపుడు వాళ్లకు సహాయం చేయడం మగటిమిలో మగటిమి
788
79. நட்பு · Friendship
உடுக்கை இழந்தவன் கைபோல ஆங்கேஇடுக்கண் களைவதாம் நட்பு.
ధరించిన వస్త్రాభరణాలు జారిపోతున్నపుడు చేతులు పట్టుకోవడానికి ఎలా లేస్తాయో అలా స్నేహితుని కష్టాలను తొలగించడానికి ఆతురతతో ముందుకు రావడమే స్నేహానికి లక్షణం
796
80. நட்பாராய்தல் · Investigation in forming Friendships
கேட்டினும் உண்டோர் உறுதி கிளைஞரைநீட்டி அளப்பதோர் கோல்.
కష్టాలు వచ్చినట్లయితే దానిలో కూడ ఒక మంచి ఉంది
ఆ కష్టాలే స్నేహితులు ఎలాంటి వారనేది కొలిచేసాధనం అవుతుంది
801
81. பழைமை · Familiarity
பழைமை எனப்படுவது யாதெனின் யாதும்கிழமையைக் கீழ்ந்திடா நட்பு.
చనువుతో స్నేహితులు చేసే పనులను చులకన చేయకుండా గౌరవించడమే నిజమైన స్నేహం
819
82. தீ நட்பு · Evil Friendship
கனவினும் இன்னாது மன்னோ வினைவேறுசொல்வேறு பட்டார் தொடர்பு.
మాటకు, చేతకు సంబంధం లేని వ్యక్తి స్నేహం కలలో కూడ దుఃఖాన్ని కలిగిస్తుంది
828
83. கூடா நட்பு · Unreal Friendship
தொழுதகை யுள்ளும் படையொடுங்கும் ஒன்னார்அழுதகண் ணீரும் அனைத்து.
శత్రువులు నమస్కరించేటప్పుడు కూడ వాళ్ల చేతుల్లో హత్యాయుధం మరుగున ఉంటుంది
అలాగే వాళ్లు కన్నీరు చిందుతూ ఏడుస్తున్నపుడు కూడా కుట్రచర్యలు వాళ్ల హృదయంలో నిండి ఉంటుంది
831
84. பேதைமை · Folly
பேதைமை என்பதொன்று யாதெனின் ஏதங்கொண்டுஊதியம் போக விடல்.
హాని కలిగించేది ఏది? మంచిని కలిగించేది ఏది? అని తెలుసుకోలేక మంచిని వదలి హానిని స్వీకరించడమే అవివేకం
850
85. புல்லறிவாண்மை · Ignorance
உலகத்தார் உண்டென்பது இல்லென்பான் வையத்துஅலகையா வைக்கப் படும்.
ఆధారాలు చూపించి ఇదే వాస్తవమని స్పష్టంగా చెప్పినప్పటికీ
మొండిగా `కాదు' అని వ్యతిరేకించేవారిని దయ్యాల పట్టికలో చేర్చాలి
851
86. இகல் · Hostility
இகலென்ப எல்லா உயிர்க்கும் பகலென்னும்பண்பின்மை பாரிக்கும் நோய்
ఒక ప్రాణిని మరొకప్రాణితో చేరనీయకుండ చేసి ద్వేషభావాన్ని కలిగించే చెడు గుణాన్నే `పగ' అంటారు
861
87. பகை மாட்சி · The Might of Hatred
வலியார்க்கு மாறேற்றல் ஓம்புக ஓம்பாமெலியார்மேல் மேக பகை.
తమ కంటె బలవంతులైన వారిని ఎదిరించడం మానుకోవాలి
తమకంటె బలహీనులైన వారిపై ద్వేషభావాన్ని వదలుకోక ఎదిరించాలి
871
88. பகைத்திறம் தெரிதல் · Knowing the Quality of Hate
பகைஎன்னும் பண்பி லதனை ஒருவன்நகையேயும் வேண்டற்பாற்று அன்று.
పగ అనే భావం సంప్రదాయానికి వ్యతిరేకమైంది కాబట్టి పరిహాసానికైనా దానిని తీసుకోకూడదు
890
89. உட்பகை · Enmity within
உடம்பாடு இலாதவர் வாழ்க்கை குடங்கருள்பாம்போடு உடனுறைந் தற்று.
మనసులో స్నేహభావం లేనివాళ్లు కలసి జీవించడం అనేది ఒక చిన్న గుడిసెలో పాముతో కలసి ఉన్నట్లు ప్రతిక్షణం భయాన్ని కలిగిస్తుంది
892
90. பெரியாரைப் பிழையாமை · Not Offending the Great
பெரியாரைப் பேணாது ஒழுகிற் பெரியாரால்பேரா இடும்பை தரும்.
పెద్దలను గౌరవించక ప్రవర్తించినట్లయితే అది తీరని దుఃఖాన్ని కలిగిస్తుంది
901
91. பெண்வழிச் சேறல் · Being led by Women
மனைவிழைவார் மாண்பயன் எய்தார் வினைவிழைவார்வேண்டாப் பொருளும் அது.
కామసుఖాన్ని కోరుతూ భార్యచెప్పినట్లు ప్రవర్తించేవాడు సత్ఫలితాన్ని పొందలేడు
బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని అభిలషించేవాళ్లకు అప్రియమైన విషయమిది
911
92. வரைவின் மகளிர் · Wanton Women
அன்பின் விழையார் பொருள்விழையும் ஆய்தொடியார்இன்சொல் இழுக்குத் தரும்.
ప్రేమ ఏమాత్రమూ లేక ధన సంపాదనే లక్ష్యంగా కలిగిన వారవనితల తీయని మాటలు నమ్మి మోసపోయిన వాళ్లకు ఆఖరున దుఃఖం సంప్రాప్తిస్తుంది
930
93. கள்ளுண்ணாமை · Not Drinking Palm-Wine
கள்ளுண்ணாப் போழ்திற் களித்தானைக் காணுங்கால்உள்ளான்கொல் உண்டதன் சோர்வு.
ఒక తాగుబోతు తాను తాగకుండా ఉన్నపుడు మరొక తాగుబోతు మత్తులో జోగుతుండడం చూసిన తరువాతైనా ఆ చెడ్డ అలవాటును గురించి ఆలోచించవద్దా?
931
94. சூது · Gambling
வேண்டற்க வென்றிடினும் சூதினை வென்றதூஉம்தூண்டிற்பொன் மீன்விழுங்கி அற்று.
గెలుపు లభిస్తున్నప్పటికీ జూదమాడే చోటుకు వెళ్లకూడదు
ఆ గెలుపు ఎరని మింగడానికి ప్రయత్నించి చేప గాలం ముల్లుకు గుచ్చుకున్నట్లు
945
95. மருந்து · Medicine
மாறுபாடு இல்லாத உண்டி மறுத்துண்ணின்ஊறுபாடு இல்லை உயிர்க்கு.
శరీరానికి సరిపడే ఆహారమైనాసరే
అధికమైనపుడు వద్దని చెప్పి మితంగా తిన్నట్లయితే జీవించడంలో ఎలాంటి ఇబ్బందీ రాదు
951
96. குடிமை · Nobility
இற்பிறந்தார் கண்அல்லது இல்லை இயல்பாகச்செப்பமும் நாணும் ஒருங்கு.
సమదృష్టి, వినయస్వభావం ఉన్నత వంశంలో జన్మించినవారికి సహజంగానే వస్తాయి
969
97. மானம் · Honour
மயிர்நீப்பின் வாழாக் கவரிமா அன்னார்உயிர்நீப்பர் மானம் வரின்.
శరీరంలోని రోమాలను తీసివేస్తే చమరీ మృగం బతకడం కష్టం
అదే విధంగా మానాభిమానాలు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు మానధనులు ప్రాణాలనే వదిలేస్తారు
972
98. பெருமை · Greatness
பிறப்பொக்கும் எல்லா உயிர்க்கும் சிறப்பொவ்வாசெய்தொழில் வேற்றுமை யான்.
పుట్టుకతో ప్రాణులన్నీ సమానమే
అయినప్పటికీ చేసేపనులనుబట్టి, తారతమ్యాలనుబట్టి కీర్త్యపకీర్తులు కలుగుతాయి
985
99. சான்றாண்மை · Perfectness
ஆற்றுவார் ஆற்றல் பணிதல் அதுசான்றோர்மாற்றாரை மாற்றும் படை.
అహంకారం లేకుండా వినయంతో నడుచుకోవడమే గుణవంతులకు గుణం
అదే పగను మైత్రిగా మార్చే సాధనంగా కూడ పెద్దలకు ఉపయోగపడుతున్నది
997
100. பண்புடைமை · Courtesy
அரம்போலும் கூர்மைய ரேனும் மரம்போல்வர்மக்கட்பண்பு இல்லா தவர்.
ఆకురాయి వలె సూక్ష్మమైన బుద్ధి కుశలత కలిగిన మేధావంతులుగా ఉన్నప్పటికీ
గుణహీనులుగా ఉన్నట్లైతే వాళ్ళను చెట్లతో ఉపమించవచ్చు
1001
101. நன்றியில் செல்வம் · Wealth without Benefaction
வைத்தான்வாய் சான்ற பெரும்பொருள் அஃதுண்ணான்செத்தான் செயக்கிடந்தது இல்.
తీరని ఆశలతో అంతులేని సంపదను కూడబెట్టి దానిని అనుభవించకుండా మరణించేవారికి కూడబెట్టిన ఆ సంపదలవలన ఏం ప్రయోజనం?
1011
102. நாணுடைமை · Shame
கருமத்தால் நாணுதல் நாணுத் திருநுதல்நல்லவர் நாணுப் பிற.
చేయకూడని పని కారణంగా లజ్జ చెందడాన్నే లజ్జ అంటారు
సౌశీల్యంగల స్త్రీ సహజంగా పొందే లజ్జ తద్భిన్నమైనది
1021
103. குடிசெயல் வகை · The Way of Maintaining the Family
கருமம் செயஒருவன் கைதூவேன் என்னும்பெருமையின் பீடுடையது இல்.
విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడంలో ఎవరు అలసత్యం వహించక ప్రయత్నాలు సాగిస్తారో ఆ గౌరవానికి మించిన గౌరవం వేరేదీ లేదు
1031
104. உழவு · Farming
சுழன்றும்ஏர்ப் பின்னது உலகம் அதனால்உழந்தும் உழவே தலை.
ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ ఈ లోకం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది
కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వ్యవసాయ వృత్తియే ఉన్నతమైంది
1041
105. நல்குரவு · Poverty
இன்மையின் இன்னாதது யாதெனின் இன்மையின்இன்மையே இன்னா தது.
దారిద్య్రబాధవంటి దుఃఖకరమైంది వేరొకటిలేదు
దారిద్య్రబాధకు ఉపమానంగా చూపించడానికి దారిద్య్రబాధతప్ప వేరేదీలేదు
1051
106. இரவு · Mendicancy
இரக்க இரத்தக்கார்க் காணின் கரப்பின்அவர்பழி தம்பழி அன்று.
ఉన్నవారి దగ్గర ఒక వస్తువును అడిగి
దానిని అతడు ఇవ్వలేకపోతే ఇవ్వనని చెప్పినవాడికే నిందగాని అడిగిన వారికి కాదు
1062
107. இரவச்சம் · The Dread of Mendicancy
இரந்தும் உயிர்வாழ்தல் வேண்டின் பரந்துகெடுக உலகியற்றி யான்.
భిక్షాటన చేసి కొందరు జీవనం సాగించాలనే నియమం ఏర్పరచి ఉంటే ఈలోకాన్ని సృష్టించినవాడు యాచకునివలె అంతటా అల్లాడుతూ తిరిగి నశించిపోవాలి
1071
108. கயமை · Baseness
மக்களே போல்வர் கயவர் அவரன்னஒப்பாரி யாங்கண்ட தில்.
నీచగుణం కలిగిన వాడు మంచివాడిలాగ తనను తాను చూపించు కుంటాడు
మనుషుల్లో మాత్రమే ఇలా రెండు రకాలైన వారిని ఒకే రూపంలో చూడగలం

అనువాదాలు © కేంద్రీయ ప్రాచీన తమిళ సంస్థ, చెన్నై · CC BY 4.0 · 22 భాషల్లో తిరుక్కురళ్

చొరవ Government of India విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
అమలు కేంద్రీయ ప్రాచీన తమిళ సంస్థ (CICT), చెన్నై